కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ ఎక్కడా…?

 కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ ఎక్కడా…?

Konda Surekha Minister Of Telangana

Loading

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో దేశమంతా ఉలిక్కిపడింది. సినీ రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు అందరూ ముక్తకంఠంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఏ చిన్న మాట అన్న కానీ ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ కొండా సురేఖ వ్యాఖ్యలపై మౌనం దాల్చడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. తమ పార్టీకి చెందిన అందులో మంత్రి కాబట్టీ మహిళా కమీషన్ అంత సీరియస్ గా తీసుకోలేదని విమర్శలు విన్పిస్తున్నాయి.

సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపారు. మరోవైపు కేటీఆర్ సైతం తన పరువుకు భంగం కలిగింది. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసులు పంపారు. అయిన కానీ మహిళా కమీషన్ ఇంతవరకూ స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *