బీఆర్ఎస్సోళ్లు ఏమైన టెర్రరిస్టులా..?
తెలంగాణ రాష్ట్రంలో గత పదినెలలుగా పోలీసు రాజ్యం నడుస్తుంది.. ప్రభుత్వ వైపల్యాలను.. లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టు చేస్తున్నారు.. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. రైతుబంధు డబ్బులు అడిగితే అరెస్టులు.. రుణమాఫీ గురించి అడిగితే అరెస్టులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసు పాలన చేస్తున్నారు.
బీఆర్ఎస్సోళ్ళు ఏమైన టెర్రరిస్టులా..?. ఎందుకు బీఆర్ఎస్ కు చెందిన నేతల.. కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారని రెడ్కో మాజీ చైర్మన్ .. బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీష్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కోన్నారు. ఆయన ఇంకా ఆ ప్రకటనలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని.. సోషల్ మీడియాను అణిచివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు.
అణిచివేత ఎంత ఎక్కువైతే అంతగా ప్రతిఘటిస్తుంది ఈ గడ్డ అన్న సంగతి ఆయనకు తెల్వదు… ఉద్యమంలో ఇలాంటి సంఘటనలెన్నో చూశాము.. ఇప్పటికైన ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ఆ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.