రేవంత్ రెడ్డి సర్కారు ఇదేమి నీతి….?

 రేవంత్ రెడ్డి సర్కారు ఇదేమి నీతి….?

Loading

ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియోటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికార కాంగ్రెస్ కు చెందిన చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఇదే అంశం గురించి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు చర్చ కూడా జరిగింది. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ .. సినిమా యూనిట్ తరపున రెండు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంతో పాటు శ్రీతేజ్ చికిత్సకు అవసరమయ్యే ఖర్చును తాము భరిస్తాము అని హామీవ్వడంతో పాటు అన్ని చేతల్లో చూపించారు.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ఓ సంఘటనను ఊదారిస్తూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల సందర్శన సందర్భంగా అధికార పార్టీ నేతలు భారీ హోర్డీంగ్స్ తో ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం మెదక్ జిల్లా కోల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన హోర్డీంగ్స్. ఫ్లేక్సీలు తీసివేశారు. ఈ క్రమంలోనే హోర్డింగ్స్ తొలగిస్తుండగా ఇద్దరు యువకులు కరెంటు షాక్ కు గురై మృతి చెందారు. కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లేక్సీని కాంట్రాక్టర్ తొలగిస్తూ అదే గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న దాన్ని అలా వదిలేశారు.

ఇదే గ్రామానికి చెందిన పసుల వెంకటేశం ,సుజాత దంపతుల కుమారుడు ప్రసాద్ (20), అక్కెం యాదగిరి,భాగ్య దంపతుల కుమారుడు నవీన్ (21) ఆ ప్లేక్సీని తొలగిస్తుండగా అది 11KV విద్యుత్ వైర్ పై పడి షాక్ కు గురై మృతి చెందారు. మృతుల కుటుంబసభ్యుల పిర్యాదుతో కొల్చారం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ వల్ల జరిగిన తొక్కిసలాటలో హీరోని బాధ్యుడ్ని చేసి కేసులు పెట్టి న్యాయం చేస్తామని అన్నారు. మీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీల వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకులకు ఎవరూ న్యాయం చేస్తారు.. ఇదేమి నీతి అంటూ ఆమె ప్రశ్నించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *