హారీశ్ రావు కు.. కాంగ్రెస్ మంత్రులకు అదే తేడా..?

 హారీశ్ రావు కు.. కాంగ్రెస్ మంత్రులకు అదే తేడా..?

Loading

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ క్రమంలో ఇంత ప్రమాదం చోటు చేసుకున్న కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాలకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఒక పక్క ప్రభుత్వం చేతకాని తనంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు మేధావులు విమర్శిస్తున్నారు. మరోవైపు మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డిని ఈ ప్రమాదం గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆ సిబ్బందిని కాపాడానికి తమ వంతు కృషి చేస్తాము. నేను బంధువుల పెండ్లి ఉంది. విదేశాలకెళ్తున్నాను అని చెప్పారు. ఇంతవరకూ బాగుంది. కానీ విదేశాలకెళ్లడమే కాకుండా పెళ్ళికి కాకుండా జల్సాలు చేయడానికెళ్లారా .. ఇక్కడ ఎస్ఎల్బీసీలో కార్మికులు ప్రాణాలతో ఉన్నారో తెలియకుండా మృత్యువుతో పోరాడుతున్నారు అని విమర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో మల్లన్నసాగర్ ఉదంతాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో జపాన్ వెళ్లడానికి వీసా పాస్ పోర్టులన్నీ సిద్ధం చేసుకున్నారు. లగేజీతో పాటు అక్కడ అవసరమైన వాటన్నింటినీ సిద్ధం చేసుకున్నారు. ఇంటీ నుండి శంషాబాద్ విమానశ్రయానికెళ్లడానికి సిద్ధమైన సమయంలో ఓ ఫోన్ కాల్ వచ్చింది హరీశ్ రావుకు.దీంతో ఆ పర్యటనను రద్ధు చేసుకుని మల్లన్నసాగర్ దగ్గరకెళ్లారు. అక్కడ ఏమి జరిగిందో మీరే చూడండి వీడియో..!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *