కావాల్సింది హామీల అమలు..బాంబులు కాదు…?

Ponguleti Srinivasa Reddy Minister of Information and Public Relations of Telangana
సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ సియోల్ పర్యటన ముగిసిన తర్వాత ధరణి, కాళేశ్వరం తరహా మరో రెండు బాంబులున్నాయి. నవంబర్ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన అతి ముఖ్యమైన నేతల అరెస్టులుంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ ” సియోల్ వెళ్ళింది మూసీ నది ప్రక్షాళనకు అవసరమైన హానీ నదీ ప్రక్షాళన విధానాన్ని అధ్యాయనం చేయడానికా.. బాంబులు తయారు చేయడానికా ? అని సెటైర్లు వేశారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో నాలుగొందల ఇరవై హామీలను నెరవేర్చాలి.. నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కావాల్సింది హామీల అమలు కానీ బాంబులు కాదు. ఇప్పటికైన డ్రైవర్శన్ పాలిటిక్స్ కాకుండా హామీల అమలు చేసే పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని వారు సూచించారు.
