హారీష్ రావు దెబ్బకి దిగోచ్చిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగోచ్చారు..
సిఎం రేవంత్ రెడ్డిని కదిలించిన హారీష్ రావు చేసిన వరుస ట్వీట్లు. దీంతో మాగనూరు విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేసిన రేవంత్ రెడ్డి..
మాగనూర్ జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై హారీష్ రావు ట్విట్టర్ వేదికగా వరుస టీట్ల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి.పూర్తి రిపోర్టు ఇవ్వాలని, ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశాలు..
కాంగ్రెస్ 11 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే రేవంత్ రెడ్డి స్పందిస్తారంటూ ఈరోజు ఉదయం నుండి తీవ్రంగా స్పందించడంతో కదిలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాగనూరు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వరుసగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో పుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..