పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి..
పవన్ కళ్యాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్ కాల్స్ రావడంతో అంత ఉలిక్కిపడ్డారు. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు కార్యాలయానికి వచ్చాయి..
దీంతో సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన గురించి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి డిప్యూటీ సీఎం పేషీ అధికారులు తీసుకెళ్లారు..దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు..