ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు కోమటిరెడ్డి…!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా బుక్కల పడుతుంది.
తాజాగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు చేతిలో అధికార కాంగ్రెస్ కు చెందిన సభ్యులు తమ ఇజ్జత్ తామే తీసుకున్నట్లైంది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతుండగా కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హారీష్ రావును ఉద్ధేశిస్తూ దొంగ దొంగ అని అరిచారు. దీంతో తీవ్ర అగ్రహానికి గురైన మాజీ మంత్రి హారీష్ ఎవడ్రా యూజ్ లెస్ ఫెలో. దొంగ దొంగ అని అరిచింది అన్నారు.
దీంతో సభ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. హారీష్ రావు ఎవర్ని ఏమి అనకపోయిన కానీ కావాలనే సబ్జెక్ట్ దారి తప్పాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అలా అనడంతో ఆయనకు కోపం వచ్చి అలా అన్నారు. దీనిపై సర్వత్రా హారీష్ రావుకే మద్ధతుగాసోషల్ మీడియాలో ఎవడ్రా యూజ్ లెస్ ఫెలో అనే పదాన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అధికారంలో ఉన్న సమయంలో నల్గోండ జిల్లాను ప్లోరైడ్ జిల్లాగా మార్చారు. నల్గోండకు పైసా లాభం చేయలేదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పోస్టులు పెట్టారు.