కమ్యూనిస్టులు కాదు కార్యకర్తలు కావాలి-ఎడిటోరియల్ కాలమ్
ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కావాల్సింది కమ్యూనిస్ట్ లు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు.. వాళ్లకు మనోదైర్యం కల్పించి క్షేత్రస్థాయిలో కోట్లాడే మనోధైర్యంతో పాటు కార్యక్ర్తలకు ఏమైన జరిగితే తామంతా ఉన్నామనే భరోసానివ్వాలి..
పదేండ్ల పాలనలో కార్యకర్తలను పట్టించుకోలేదని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దగ్గర నుండి సీనియర్ నేతలు హారీష్ రావు, కేటీఆర్ల వరకు అందరూ పలు మార్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఎలా ఉన్న నడుస్తుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గల్లీలో కోట్లాడే కార్యకర్తల దగ్గర నుండి అసెంబ్లీలో పోరాడే ప్రజాప్రతినిధుల వరకూ అందర్ని సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్లాలి.
గత ఎన్నికలకు ముందుదాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదని ఎవరో ఎందుకు ఆ పార్టీ నేతలే ఊహించలేదు. ఇదే అంశం ఓ మంత్రి తనతో అన్నాడని కేటీఆరే స్వయంగా చెప్పారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది.? . అని ఆలోచిస్తే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ గెలుపు కోసం అహర్నిశలు పని చేశారు.
పదేండ్ల పాటు అధికారంలో లేకపోయిన కానీ తాము చెప్పిన ఇచ్చే అలవి కానీ హామీలను ఓటర్ మదిలోకి చొచ్చుకుపోయేలా ప్రచారం చేశారు. అక్కడితో ఆగకుండా పోలింగ్ బూత్ ల్లో తమ పార్టీకి ఓట్లేసే విధంగా ఓటర్లను తమవైపు తిప్పే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఓటింగ్ శాతం మధ్య తేడా కేవలం 1.80% మాత్రమే.
కానీ కాంగ్రెస్ శ్రేణులతో పాటు కార్యకర్తలకు ఆ పార్టీ నాయకత్వం పదేండ్ల పాటు ఇచ్చిన భరోసా ఇప్పుడు నాలుగేండ్లు బీఆర్ఎస్ నాయకత్వం ఆ పార్టీ శ్రేణులకు ఇవ్వాలి. అలా అని ఇప్పుడు నాయకత్వం అండగా లేదని కాదు మరింత ప్రణాళికలతో వ్యూహారచనలతో ముందుకెళ్తూ క్యాడర్ ను బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్తే కమ్యూనిస్ట్ లతో అవసరం ఉండదు.. బీఆర్ఎస్ శ్రేణులే ప్రజల తరపున రోడ్లపైకి కొట్లాడ్తారు.. పోరాడతారు..