కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్ గా కోహ్లి(158) రికార్డు సృష్టించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రెండు క్యాచ్లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (156)ను విరాట్ అధిగమించారు.
ఓవరాల్ గా అత్యధిక క్యాచ్ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే(218), ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(160) తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచారు.