KCR కు విజయశాంతి సలహా

Vijayashanti gave advice to KCR
6 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత .. మాజీ ఎంపీ విజయశాంతి ఓ సలహా ఇచ్చారు. ఆమె ఎక్స్ వేదికగా ” బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు.
కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడతారు.
దీనిపై చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినేతగా కేసీఆర్ జవాబు చాలా అవసరం.. ఆ పార్టీపై రుమర్లు ఎప్పుడు ఉంటాయి కానీ వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని ఆమె ఎక్స్ లో తాను రాసుకోచ్చారు.
