ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి..!

 ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి..!

Loading

నిండు శాసనస భను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పుకున్నారు..

కానీ ఆయన ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఇచ్చిన అసమ్మతి నోట్ లో మహువా మెయిత్రాను వ్యక్తిగత ద్వేశం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్పెల్ చేశారని సైతం పేర్కొన్నారని అన్నారు.

నాడు గవర్నర్ పై దాడి చేసిన విషయంలో ఎంఎల్ ఎలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లను ఎక్సైల్ చేసిన సందర్భంలోనూ అది తప్పుడు చర్య అని, ఈ విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్కు మార్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. నాడు స్పీకర్, ముఖ్యమంత్రి వారి విధులను సరిగ్గా నిర్వ హించలేదని ఆయన ఆరోపించారు.

నేడు ఆ మాటలను కూడా దాచి పెట్టారని తెలిపారు. ఒక వైపు తాను వ్యతిరేకించిన వాటినే నేడు ఉదహరిస్తూ మరోవైపు ఎంఎల్ఎ జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనడం కక్ష్య సాధింపు, ఉద్దేశ్య పూర్వక చర్యలను ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక తీరు, అధికారంలోకి రాగానే మరొక తీరుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. నాడు తప్పు అనిపించింది అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *