తెలంగాణలో రోడ్లపైకి నిరుద్యోగ యువత -నోర్లు మెదపని మేధావులు & మీడియా
సహజంగా అధికార పక్షం తప్పు చేసిన… ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన అక్కడున్న ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీస్తుంది..ప్రతిపక్షానికి తోడుగా మేధావి వర్గం.. మీడియా మద్ధతుగా నిలుస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉండే నిరంతర ప్రక్రియ.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని భూత అద్దంతో చూసిన మేధావి వర్గం… మీడియా ఛానెల్స్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిన కానీ ప్రశ్నించడం పక్కనపెడితే ప్రశ్నించే వాళ్ళను.. నిరసన కార్యక్రమాలను ప్రసారం చేయడమే మానేశాయి.. ఇది వినడానికి కొద్దిగా నమ్మశక్యం లేకపోయినా నిజం ఇదే..
తెలంగాణలో తాజా హాట్ టాపిక్ నిరుద్యోగ ధర్నాలు.. డీఎస్సీ.. గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్నారు.. తాజాగా నిన్న సోమవారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి అంతా ఆందోళన చేస్తూనే ఉన్న DSC అభ్యర్థులను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని చెప్పి మరి మహిళలు అని చూడకుండా అర్ధరాత్రి రోడ్డు మీదకు ఈడ్చిన కానీ మీడియా చూపించదు… మేధావి వర్గం ప్రశ్నించదు..
అఖరికి నిరుద్యోగ యువత తమను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలిస్ అధికారుల కాళ్ళను మొక్కిన వాళ్ళ బాధ తీవ్రతను అర్ధం చేస్కుని అయిన మీడియా ప్రచారం చేయదు.. మేధావి వర్గం ప్రశ్నించదు.. ఇది ఎదో కల్పితం కాదు నిరుద్యోగ యువతనే మీడియా తమ బాధను గోడును చూపించదు అని వాపోయిన వీడియో మనం చూసినం కూడా..
అఖరికి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.. ముఖ్యమంత్రి గా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించడంలేదు అని ఏకంగా పక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కి వస్తే బాబుకు వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు..
ఇలా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసిన… పక్కా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించదు.. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు భరోసా నివ్వకుండా ఎగతాళిగా మాట్లాడతారు..
అయిన కానీ మేధావి వర్గం ప్రశ్నించదు.. మీడియా అండగా నిలబడదు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు …