ఇద్దరు MLAలా.?.. 10 మంది MLA లా?- రేవంత్ ముందు పెను సవాల్..!

Don’t want it today.. Congress is asking for a kiss today..!
ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిగా .. ప్రభుత్వాధినేతగా చేసింది ఏమి లేదు. ఒక పక్క ఏడాదిన్నరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు. పైకి మళ్లా పార్టీలో అసంతృప్తులు.. మంత్రివర్గంలో బెర్తు కోసం ఢిల్లీలో పైరవీలు.. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం చేస్తుందని అంతర్యుద్ధం. ఇవన్నీ తలనొప్పిగా మారిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా మరో సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలల్లో ఇద్దరి ఎమ్మెల్యేలపై వేటు తప్పనిసరైంది.
టెక్నికల్ గా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహారి అధికారకంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా తన తనయ కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా వరంగల్ లో నిలబడి ఎంపీగా గెలుపొందారు. వీరిద్దరిపై తప్పనిసరిగా వేటు వేయాల్సిన తప్పనిసరైంది. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సాంకేతకంగా ఎక్కడ అవకాశం లేదు. అయితే ఆ ఇద్దరిపై వేటు పడకూడదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మరో అవకాశం ఉంది. అదే బీఆర్ఎస్ కు చెందిన మరో పది ఎమ్మెల్యేలను లాక్కోవడం.
పది మంది ఎమ్మెల్యేలను తీసుకోని బీఆర్ఎస్ ఎల్పీ ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవడం . ఇది చేయమని ఇటీవల ఢిల్లీలో తనను కల్సిన రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తుంది. అయితే వేటు వేస్తే ఇద్దరి ఎమ్మెల్యేలపై వేయాలని.. లేదా మిగతా ఎనిమిది మంది కోసం ఓ పది ఎమ్మెల్యేలను లాక్కోవడం కానీ చేయాలని. ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆ తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే మాత్రం రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ కు తప్పవు తిప్పలు.ఈ తిప్పలు తప్పాలంటే మాత్రం ఓ పది మందిని లాక్కోవడం . లేదా ఇద్దరిపై వేటు వేయడం.. రేవంత్ రెడ్డి ఏమార్గం అనుసరిస్తారో సుప్రీం కోర్టు తీర్పు తేల్చనున్నది..!
