దువ్వాడ కుటుంబ కథాచిత్రంలో మలుపులు ఎన్నో…?
దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో విన్పిస్తున్న పేరు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి.తనను రాజకీయంగా ఆర్థికంగా ఎదుర్కొలేక నన్ను వ్యక్తిగత సమస్యలకు రాజకీయ రంగు పూసి ప్రజల్లో చులకన చేయడానికి టీడీపీ చేస్తున్న కుట్ర అని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు.. మరోవైపు దివ్వెల మాధురి అనే ఓ మహిళ కు దగ్గరై మమ్మల్ని పిల్లలను దూరం పెడుతున్నారు.. ఎవర్ని వదలిపెట్టను అని ఏకంగా వార్నింగ్ ఇస్తుంది దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి. నన్ను అనవసరంగా ఈ గొడవల్లోకి లాగి పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు అని వాపోతుంది దివ్వెల మాధురి..?. అసలు ఎవరూ ఈ దివ్వెల మాధురి ..?. ఎందుకు దువ్వాడ కుటుంబం రోడ్ పైకి ఎక్కింది..?.. దువ్వాడ వాణి ఎందుకు ఇంతలా పోరాటం చేస్తున్నారు.? అనేది ఇప్పుడు తెలుసుకుందాము..!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో రెండు ఏండ్ల కిందటనే ఈ గొడవ మొదలైంది అని సిక్కోల్ జిల్లాలో టాక్.. దివ్వెల మాధురి అనే ఓ మహిళ సోషల్ మీడియా లో రీల్స్ తో పోస్టులతో ఆదరణ చురగొన్నది. మాధురిని శ్రీనివాస్ కు పరుచయం చేసిందే వాణి అని గుసగుసలాడుకుంటున్నారు.. మాధురి ఉత్సకతను చూసి పార్టీ కార్యక్రమాల్లో అధికారక కార్యక్రమాల్లో పాల్గొనాలని వాణి గారే ఒత్తిడి చేశారు అని చెబుతుంది మాధురి దివ్వెల.. అంతే తప్ప మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు మాధురి.లేదు మాధురి వల్లనే మా నాన్న దువ్వాడ శ్రీనివాస్ మమ్మల్ని కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు అని చెబుతున్నారు శ్రీనివాస్ పెద్ద కూతురు హైందవి..
ఉన్న ఆస్తులన్నీ మాధురికి కట్టబెట్టి టెక్కలి పరిధిలో ఓ కొత్త ఇల్లును నిర్మించుకుని మాధురితోనే ఉంటున్నారు అని విమర్శిస్తున్నారు దువ్వాడ వాణి.. నేను స్నేహితుడు లెక్క మాధురికి అండగా ఉంటున్నాను.. నాకున్న వ్యాపారల్లో వచ్చే ప్రతిపైసా వాణి కే ఇస్తున్నాను. ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మొదట వైసీపీ అధినేత జగన్ నాకు కేటాయిస్తే నా సతీమణి అయిన వాణి జగన్ దగ్గరకెళ్లి ఆత్మహత్య చేస్కుంటా అని బెదిరిస్తే వైసీపీ అధినేత జగన్ తిరిగి వాణి కి ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వే ఫలితంగా నాకు మళ్ళీ ఇచ్చారు. నేను కుటుంబాన్ని పట్టించుకోకపోతే నేను వాళ్ళను దూరం పెడితే ముందు వాణికి ఎందుకు టికెట్ ఇప్పిస్తాను అని ప్రశ్నిస్తున్నారు..
గురువారం ఏకంగా తన ఇద్దరు కూతుర్లతో కల్సి వాణి దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఉంటున్న ఇంటికెళ్లి మరి అర్ధరాత్రి వరకు ధర్నా చేశారు.. మాధురి శ్రీనివాస్ గురించి పలు సంచలన ఆరోపణలు చేశారు.. ఇంత చేసిన కానీ నా భర్త నాకు కావాలని వాణి, తమ తండ్రి తమకు కావాలని కూతుర్లు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు నన్ను బజారుకి ఈడ్చిన వాణి కి బుద్ధి చెప్పడటానికి నేను శ్రీనివాస్ తోనే ఉంటాను అని మాధురి దివ్వెల వార్నింగ్ ఇస్తున్నారు.. నా పరువు ప్రతిష్టలు రోడ్ పాలు చేసిన వాణి నాకు వద్దు అంటున్నారు శ్రీనివాస్.. చూడాలి మరి మున్ముందు ఈ కుటుంబ కథచిత్రంలో ఎన్ని మలుపులు ట్విస్టులు చోటు చేస్కుంటాయో..?!