తూచ్..! 15వేలు కాదు 12వేలే…!

 తూచ్..! 15వేలు కాదు 12వేలే…!

గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం.. డిసెంబర్ మూడుకి ముందు రైతుబంధు తీసుకుంటే పదివేలు.. అదే మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరూ రుణాలు చెల్లించకండి. మేము అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు.

తీరా అధికారంలోకి వచ్చి ఏడాది అయిన ఇంతవరకూ రైతుభరోసా పైసలు చెల్లించలేదు. ఎంతోగొప్పగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ చాలా మందికి కాలేదని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వల్ల ప్రస్తుతానికి రైతు భరోసా కింద పన్నెండు వేలు మాత్రమే ఇస్తాము అని ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పదిహేను వేలు అని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసి పన్నెండు వేలు ఇస్తున్నారు. ఏరు దాటకముందు ఓడమల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న లెక్క రేవంత్ సర్కారు వ్యవహరిస్తుందని వారు విమర్శిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *