బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి కాంగ్రెస్ సర్కారులో వణుకు…?
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావోస్తుంది. ఈ ఏడాదిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి.. గత పదకొండు నెలల్లో ఆ పార్టీ వైపల్యాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా నే ఎక్కువగా యుద్ధం చేసిన సంగతి అందరికి తెల్సిందే. ఒకానోక సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ ను కేసులు పెట్టి అరెస్టులు చేయాలని దాదాపు ఓ పదిమందిపై అక్రమ కేసులను సైతం పెట్టింది. అయితే వెంటనే అలెర్ట్ అయిన బీఆర్ఎస్ లీగల్ టీమ్ వారి తరపున న్యాయస్థానాల్లో పోరాడి వారి అరెస్టులను ఆపడమే కాకుండా సోషల్ మీడియా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని ప్రజల్లో చర్చ పెట్టింది.
తాజాగా తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్ట్ కూడా ఈ కోవా కిందకే వస్తుంది. తెలంగాణ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న లగచర్ల వ్యవహారాన్ని ప్రజల్లో డైవర్ట్ చేయడం కోసమే దిలీప్ అరెస్ట్ ను ముందరేసుకుందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరు గ్యారంటీల దగ్గర నుండి ప్రజలకు చెందిన ప్రతి సమస్యపై మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫోకస్ పెట్టి మరి ఓ యుద్ధాన్నే నడిపిస్తుంది.
ఉన్న పదహారు చానేళ్ళు, యూట్యూబ్ ప్రభుత్వాధీనంలో ఉన్న కానీ వెనక్కి తగ్గేదేలే అన్నట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకపక్క మీడియాను మ్యానేజ్ చేసిన కానీ సోషల్ మీడియాను తట్టుకోలేక ఓ వెయ్యి మందిదాక వారీయర్స్ ను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఐదుకోట్లు పోయిన పర్వాలేదు కానీ యూట్యూబ్ ఛానెళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నాయంటేనే బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి కాంగ్రెస్ ఎంతగా వణుకుతుందో ఆర్ధమవుతుందని రాజకీయ పండిట్స్ చెబుతున్నారు.