తిరుమల లడ్డు వివాదం-చంద్రబాబేనా ఇది..?

 తిరుమల లడ్డు వివాదం-చంద్రబాబేనా ఇది..?

Tirumala Ladddu Issue

ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది.

వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈరోజు గురువారం భేటీ అయ్యారు. తాజాగా బాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడ్నైన లాగుతారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరికొంతమంది నెటిజన్లు “నెయ్యి కొనుగోలుకు తిరుమలకు ప్రత్యేక మార్కెటింగ్ విభాగం ఉంది. తిరుమల పాలకమండలి విభాగం ,టీటీడీ బోర్డు కమిటీ అన్నీ కలిసి టెండర్ల ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తాయి.నెయ్యి నాణ్యత పరీక్షించే ప్రత్యేక ల్యాబ్ కూడా తిరుమలలో ఉంది.ఇన్ని అంచలు దాటి జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యిని ఎలా తెస్తారు.ఏదైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి కదా అని వాదన చేస్తున్నారు.ఎవరి వాదన ఎలా ఉన్న కానీ నెయ్యిలో కల్తీ జరిగితే ఈ విభాగాలన్నీ తప్పు చేసినట్లే కదా అని అంటున్నారు. ఏది ఏమైన నిజనిజాలు త్వరలో తేలనున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *