రేవంత్ రెడ్డి సర్కారుకు తీన్మార్ మల్లన్న షాక్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కారణం అని అందరికి తెల్సిందే.. క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై.. ఆ పార్టీలోని నేతల గురించి ఉన్నది లేనిది ప్రచారం చేస్తూ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ & టీమ్ పై వ్యతిరేకత రావడానికి తనవంతు పాత్ర పోషించాడు..
ఇదే సంగతి తీన్మార్ మల్లన్న కూడా పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు.. తాజాగా బీసీ కులగణన గురించి జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం పాల్గోన్నారు..ఈ క్రమంలో మల్లన్న మాట్లాడుతూ” నేను ఎమ్మెల్సీ కావడానికి బీసీలే కారణం.. నేను ఎమ్మెల్సీ అయినంటే దానికి బీసీలు వేసిన బిక్ష…
కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాహుల్ గాంధీ చెప్పారు.. కులగణన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి.. పార్టీల ఫరంగా విబేధాలు ఉండచ్చు కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందంటే నేను ఎవర్ని అయిన ఎదిరిస్తాను అని పరోక్షంగా రేవంత్ రెడ్డి సర్కారుకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.