బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట..!

Bomma Mahesh Kumar Goud Member of Telangana Legislative Council
బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట జరుగుతుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణను మళ్లీ చెపట్టాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కులగణన సర్వేలో పాల్గోనని మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు రీసర్వే అడిగే అర్హత లేదని అన్నారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ ప్రజలను సైతం కేసీఆర్ కలవడం లేదు. అలాంటప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లో మాజీ మంత్రి హారీష్ రావు, కేటీఆర్, కవితల మధ్య మూడు ముక్కలాట జరుగుతుందని ఆరోపించారు.బీజేపీ నుండి ఎనిమిది మంది ఎంపీలున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. తెలంగాణకు బడ్జెట్ లో సున్నా కేటాయించింది. పది పైసలు కూడా తీసుకురాలేదు అని ఆరోపించారు.
