జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా..?
ఏపీలోని జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా అని ప్రతిపక్ష వైసీపీ పార్టీ తన అధికారక ట్విట్టర్ వేదికగా మండిపడింది. రాష్ట్రంలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంతరెడ్డి క్షమాపణలు చెప్పిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోను వైసీపీ పార్టీ తన ఎక్స్ లో పోస్టు చేసి” జేసీ ఫ్యామిలీ కి ఇదేం రాక్షసానందం..?. ఎమ్మెల్యేగా ఉండి జేసీ అస్మిత్ రెడ్డి అధికార మదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు.. జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా” అని ఎక్స్ లో పోస్టు చేసింది.
అంతకుముందు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పీఎస్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిరసనకు దిగారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొన్నది. దీంతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కేసులు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత రెడ్డికి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఫోన్ చేశారు. దీనిపై సీఐ స్పందిస్తూ” నువ్వు చెబితే కేసు పెట్టాల్నా? అని సీఐ నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ అందుకు నిరసనగా ఎమ్మెల్యే నేతృత్వంలో ఆందోళన చేపట్టారు.