అసెంబ్లీలో తీవ్ర గందరగోళం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా గందరగోళంగా మారాయి.. సభలో మంత్రి సీతక్క వర్సెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్లుగా మారాయి.. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి అందరికి తెలవదా..?. ఇప్పుడు మేము చేర్చుకుంటే అదేదో తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారు.ఇప్పటికైన బుద్ధి తెచ్చుకోవాలని “ఆమె అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలచేత రాజీనామా చేయించి చేర్చుకోవాలని మీరే కదా పెట్టింది. మీరు పెట్టిన మ్యానిఫెస్టోలో ఉన్నది అదే కదా.. మరి ఎందుకు రాజీనామా చేయించలేదు అని ఆమె ఫైర్ అయ్యారు.. మీరు చెప్పేది నీతులు .. వాటిని పాటించరా..?. అని విరుచుకుపడ్డారు..
ప్రతిసారి మహిళ అని చూడకుండా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నన్ను ఆశీర్వాదించారు.. ఇప్పుడు నన్ను ఆశీర్వదించారు. ఎందుకు నన్ను ప్రతిసారి టార్గెట్ చేస్తారు అని తిరిగి ప్రశ్నించారు. మొన్నటెన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నిజం కాదా..?. పార్టీలోకి వస్తే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది నిజం కాదా అని ఆమె అన్నారు.
దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ” సబితా అక్క అన్నది నిజం.. నేను పార్టీలోకి రమ్మన్నది .. మరి నేను టీడీపీలో ఉన్నప్పుడు సబితా అక్క నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.. పార్టీలో చేరితే నన్ను ఎంపీగా గెలిపిస్తానని హామీ ఇచ్చారు. నేను పార్టీ మారగానే అక్క బీఆర్ఎస్ లోకి వెళ్ళి నన్ను మోసం చేశారు అని అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ” కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని ఓ దళితుడ్కి ఉన్న ఎల్పీ పదవి లేకుండా చేసింది బీఆర్ఎస్ కాదా..?. దళితుడు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉంటే దాన్ని లేకుండా చేసింది మీరు కాదా,, దళితుడ్ని సీఎం చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా” అని విమర్శించారు.