ఆడబిడ్డలకు ఇవ్వడానికి పైసల్లేవు- అందాల పోటీకి మాత్రం కోట్లు..!

 ఆడబిడ్డలకు ఇవ్వడానికి పైసల్లేవు- అందాల పోటీకి మాత్రం కోట్లు..!

Loading

తెలంగాణ బడ్జెట్ పై మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం ఆద్యంతం అబద్దం..ఇదే సారాంశం. 72 పేజీల భట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు అని విమర్శించారు..

ఇంకా ఆయన మాట్లాడుతూ “నా సిద్దిపేట నియోజకవర్గంలోనే రెండు లక్షల లోపు రుణం ఉన్న 10,150 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు .. కానీ రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేసినం అని భట్టీ విక్రమార్క అన్ని అబద్ధాలు చెప్తున్నారు.. మీ మధిర నియోజకవర్గానికి వెళ్లి రుణమాఫీ అయిందా అని రైతులను అడుగుదామా భట్టి గారు? అని సవాల్ చేశారు..

బడ్జెట్ లో అందాల పోటీల కోసం మాత్రం రూ.250 కోట్లు బడ్జెట్లో పెట్టారు కానీ మహిళలకు ఇస్తానన్న రూ.2500 కోసం మాత్రం నయాపైసా బడ్జెట్లో పెట్టలేదని హెద్దేవా చేశారు. ఈ సంవత్సరం మద్యం ద్వారా 50 వేల కోట్లు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నాడు.. ఇప్పటికే బీర్ల ధరలు పెంచిండు.. లిక్కర్ ధరలు పెంచుతున్నాడు. కొత్త బ్రాండ్లు తెస్తున్నాడు.. గత సంవత్సరం రూ.5,888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది..ఈ సంవత్సరం రూ.2,738 కోట్లు రెవెన్యూ మిగిలి ఉంటుంది అని బడ్జెట్ బుక్ లో రాసారు .

కానీ రేవంత్ రెడ్డిని ఉద్యోగులు జీతాలు అడిగితే రూ.500 కోట్లు కూడా లేవు అని అబద్ధాలు చెప్తున్నాడని ఆరోపించారు.. తెలంగాణలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతామని రూ.22,500 కోట్లు గత సంవత్సరం బడ్జెట్‌లో పెట్టారు..అందులో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత మందికి ఇండ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇళ్ళు కట్టుకోవడానికి రూ.1 లక్ష అదనంగా ఇస్తాం అని గత సంవత్సరం బడ్జెట్‌లో పెట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో అసలు ఆ ముచ్చటనే లేదని విమర్శించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *