కలెక్టర్ పై దాడిలో కుట్ర లేదు- ఎంపీ డీకే అరుణ
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుకోసం భూసేకరణకు వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వాధికారులపై అక్కడ రైతులు, గ్రామ ప్రజలు దాడి చేసిన సంగతి తెల్సిందే.. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ లగిచర్ల ఘటనలో కుట్రకోణం లేదని అన్నారు.
కుట్ర కోణం ఉందంటే రాష్ట్రంలో ఇంటిల్ జెన్స్ వ్యవస్థ ఏమి చేస్తున్నట్లు… కలెక్టర్ వెళ్ళినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదు అని ఎంపీ అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ఘటనలో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలున్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పుడు సీఎం కు ఎందుకంతా ప్రేమ ?. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది విమర్శించారు.