అప్పుడు అరచేతిలో వైకుంఠం..!. ఇప్పుడు నిర్వేదం..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలతో పాటు నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలు. రాష్ట్రంలో ఏగల్లీకెళ్లిన కానీ అక్కడ చేసే ప్రచారం మేము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తాము. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదోందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచుతాము.. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాము..
జాబ్ క్యాలెండర్ కు చట్టభద్రత కల్పిస్తాము అని ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారంతో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించారు. పదేండ్ల పాటు పాలించి రాష్ట్రాన్ని దేశంలోనే నంబరు వన్ స్థానంలో నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కేవలం పార్టీకి చరిత్ర ఉందని.. ఎలాంటి మంత్రిత్వ అనుభవం లేని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ను ఆదరించారు తెలంగాణ ఓటర్లు. తీరా అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలు గురించి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు నిలదీసిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాట గత పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఇప్పుడు నెలనెల వడ్డీలకే డబ్బులు సరిపోతున్నాయి.
పథకాల అమలుకు పైసల్లేవు అని.. సాక్షాత్తు ముఖ్యమంత్రే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరు గ్యారంటీలను అమలు చేయలేము అని తేల్చి చెప్పారు. మా ప్రభుత్వం గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. పథకాలు అమలుకు ఆలస్యం గత ప్రభుత్వం చేసిన తప్పులు.. పాపాలే.. ఆరు గ్యారంటీల అమలు జరగదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్షలు వెలువడుతున్నాయి. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా నిర్వేదం చెందుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో తెల్వదా ఇన్ని అప్పులున్నాయి. ఎలా అమలు చేయాలని.. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.