అప్పుడు గత్తర లేపారు..! ఇప్పుడు గమ్మున్నారు..?

ఆయనో ప్రజాప్రతినిధి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రజల కోసం. వారి సమస్యలకోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు. పోరాటాలతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము.. ఎమ్మెల్యే అంటే కార్లు బంగ్లాలు ఆస్తులు సంపాదించడం కాదు ప్రజాసేవ చేయాలని నిరూపించిన నాయకుడు. అలాంటి నాయకుడ్కి సాక్షాత్తు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. అపాయింట్మెంట్ దొరకకపోతే ఎలాంటి సమస్య ఉండకపోయేది. ముఖ్యమంత్రిని కలవాలని చెబితే ముఖ్యమంత్రి నివాసానికి రమ్మని తీరా వెళ్లాక అక్కడ నుండి ఎలాంటి స్పందన లేదు.

పిలిచి మరి అవమానించారు. ఇంతకూ ఈ సంఘటన ఎవరి గురించి ఆలోచిస్తున్నారా..?. ఇంకా ఎవరూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికెళ్ళిన ఆయనకు నిరాశే ఎదురైంది. దాదాపు ఐదారు గంటల పాటు ఎదురుచూసిన ఎలాంటి స్పందన లేదు. ఏకంగా సీఎం ఇంటి బయట నడిరోడ్డుపై ఎదురుచూసిన ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, పొలిటీకల్ క్రిటిక్స్ మండిపడుతున్నారు. గతంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి వచ్చి నాటి ప్రగతి భవన్ గేట్లు ఎదురుగా కుర్చీ వేసుకుని మరి కూర్చున్నాడు దివంగత గద్దర్.
నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అధికారక కార్యక్రమాలతో ఎవర్కి ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజు మొత్తం. కానీ గద్దరు కావాలనే రాజకీయ స్వాలాభం కోసం అలా వెళ్లారు. దీనికి నాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్.. ఆ పార్టీ సానుభూతిపరులు.. మేధావులుగా భావిస్తున్న కొంతమంది బీఆర్ఎస్ ను ఏకిపారేశారు.కానీ నేడు మాత్రం అపాయింట్మెంట్ ఉందని వెళ్లిన గుమ్మడి నర్సయ్యను కల్వకుండా ఆయన్ని అవమానిస్తే మాత్రం గమ్మున ఉన్నారు ఎందుకంటూ మేధావులపై విరుచుకుపడుతున్నారు. నాడు కాంగ్రెస్ ఆడిన నాటకంలో గద్దరు పాముగా మారితే నేడు ప్రజల సమస్యలను వివరించడానికెళ్లిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను అదే కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందని విమర్శలు వెలువడుతున్నాయి.
