రాజీవ్ గాంధీ విగ్రహాం ఒకే… మరి తెలంగాణ తల్లి విగ్రహాం…?

 రాజీవ్ గాంధీ విగ్రహాం ఒకే… మరి తెలంగాణ తల్లి విగ్రహాం…?

Telangana Thalli

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఆ నిర్ణయంలో భాగంగా సచివాలయం ఎదుట అమరవీరుల స్మారక జ్యోతి, తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం జరిగింది.

తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాలని చూసిన స్థలంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాల్సిన చోట అంత ఆర్ధాంతరంగా రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటును తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏమోచ్చింది .. అక్కడ కాకుండా వేరేచోట ఏర్పాటు చేయచ్చు కదా..

తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు ప్రస్తావన రాకముందు రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించేవారు కాదు.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కనెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్.. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు కొన్ని వందల మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్..

అలాంటి పార్టీకి చెందిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అది అమరవీరుల స్మారక జ్యోతి పక్కన ఏర్పాటు చేయడమే అమరవీరుల అత్మబలిదానాలను వారి త్యాగాలను కించపరిచేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. మేము విగ్రహాం ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ ఇలా తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటే మమ్మలని బాధిస్తుందని తెలంగాణ వాదులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *