బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ కు రంగం సిద్ధం..!
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో ముందుగా లగచర్ల లో రైతులకు బేడీలు వేయడం దగ్గర నుండి బీఏసీలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడం వరకు తమదైన శైలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వాకౌటులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో అప్పులపై.. లగచర్లపై చర్చ చేపట్టాలని పట్టుబడుతూ అసెంబ్లీ ప్రాంగాణంలో నిరసనకు దిగారు.
అంతేకాకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రన్స్ గేటు దగ్గర ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపటికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది.