ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ ఘటనపై లేకపాయే..!

 ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ ఘటనపై లేకపాయే..!

The focus on the opposition is not on the SLBC incident..!

Loading

ఎస్ఎల్బీసీ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని నేటికి దాదాపు పది రోజులు కావోస్తుంది. ఇంతకూ ఆ కార్మికులు ప్రాణాలతో ఉన్నారో..? లేరో.. కనీసం సమాచారం లేదు. పోనీ ఆ ఘటనలో ఎంత పురోగతి ఉందో ఇంతవరకూ ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ఆ ప్రాజెక్టుని నిర్మించే కాంట్రాక్టర్ ఏమో ఎనిమిది మంది ప్రాణాలతో లేరని చెప్పారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఓ మంత్రేమో నాకు తెల్సి వాళ్లు బతికి ఉండే అవకాశం లేదని చెప్పేశారని ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతలా పరిస్థితులున్న కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువడుతున్నాయి. ఎస్ఎల్బీసీ ఘటన జరిగిన తర్వాత ఇంతవరకూ అటువైపు చూసే సమయం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారానికి సమయం ఉంటుంది.

ఏకంగా స్పెషల్ ప్లైట్ లో ఢిల్లీ వెళ్లి రావడానికి సమయం ఉంటుంది. అఖరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా విచ్చేసిన నటరాజన్ మీనాక్షి కి స్వాగతం పలకడానికి.. ఆ ఇంచార్జ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి సమయం ఉంటుంది.

కానీ ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఇన్ని రోజులైన అటువైపు చూడటానికి కానీ దానిపై మాట్లాడటానికి కానీ సీఎం రేవంత్ రెడ్డికి సమయం లేదని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికి ఉండే సమయం ఆ టన్నెల్ కెళ్లడానికి లేకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని వారు విశ్లేషిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *