8ఏండ్ల కిందట కల నేడు నెరవేరింది
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాధాపూర్ లో ప్రముఖ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది.. FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు నిన్న శనివారం ఒక్కరోజులోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి తెల్సిందే. అయితే దీని గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎనిమిదేండ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు.
శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని చాలా చోట్ల చెరువులను నాలాలను ఆక్రమించి ఎన్నో అక్రమ కట్టడాలు నిర్మించారు. అందులో ఒకటి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం ఒకటి. దానిపై చర్యలు తీసుకోమని అప్పటి ప్రభుత్వానికి విన్నవించారు. అంతేకాకుండా ఈ ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను చెరువులో సగాన్ని అడ్డంగా గోడకట్టి కొన్ని ఎకరాలు అక్రమించుకున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
అక్రమమని తెలుస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అప్పటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అక్రమించుకుని నిర్మిస్తున్న నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ అప్పటి మంత్రిని ఎప్పటిలోగా సమాధానం ఇస్తారని సూటిగా సమాధానం చెప్పాలని నాడు శాసనసభలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ఇటు రేవంత్ రెడ్డి అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు ఎనిమిదేండ్ల కిందట కలను నేడు నిజం చేశారని ఆకాశానికి ఎత్తుతున్నారు.