బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఢీల్..!

సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది.
తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
మీడియాతో మంగళవారం మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పండించిన ధాన్యాన్ని కొనడం లేదు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.రైతుల నుండి ధాన్యాన్ని కొనడానికి పైసలు లేవు కానీ అందాల పోటీలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అని ఆయన హేద్దేవా చేశారు.
