పెళ్లికి పిలవడానికెళ్తే పార్టీ మారతారంటూ ప్రచారం

chamakura mallareddy
తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి.. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నారు. తెలంగాణ టీడీపీ గూటికి చేరుతున్నారు .. తెలంగాణ టీడీపీ పార్టీ పగ్గాలు మల్లారెడ్డికి అప్పజెప్పనున్నారు అని కొన్ని మీడియా సంస్థలు..వెబ్ సైట్లు వార్తలను తెగ ప్రచారం చేస్తున్నాయి.
అయితే ఈ నెల లో జరగనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని ఆహ్వానించడానికి తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కల్సి హైదరాబాద్ లోని బాబు నివాసానికెళ్లి పెండ్లి పత్రికలను అందజేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు సైతం బాబును కలిశారు.
అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నాను. టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాను.. హైదరాబాద్ ను సైబరాబాద్ గా.. హైటెక్ సిటీగా మార్చింది చంద్రబాబే. అసలు తెలంగాణ అభివృద్ధి చెందిందే బాబు హాయాంలో. అందుకే టీడీపీలో చేరుతున్నాను అని మీడియా సమావేశంలో తేల్చి
