ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?
ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ అయింది. ఇంతకూ ఎవరూ ఆ మహిళ నేత అనుకుంటున్నారా.. ఇంకా ఎవరూ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మహిళ కమీషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ.
అధికార కూటమి పార్టీలో చేరాలని ఆమె ఏకంగా ప్రెస్మీట్ పెట్టి మరి వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై దుమ్మెత్తిపోసింది. తీరా ఇటు టీడీపీ అటు జనసేన పార్టీ నేతలు సదరు నేత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆ నాయకురాల్ని చేర్చుకోవద్దు అని ఆధిష్టానానికి తెగేసి చెప్పారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుని అనని మాటల్లేవు. అఖరికి తమ కులం గురువుగా భావించే దివంగత రామోజీరావు ను సైతం వదల్లేదు.
ఇవన్నీ మీరు మరిచిపోయిన మేము మరిచిపోము. అందుకే ఆమెను చేర్చుకోవద్దు అని టీడీపీ శ్రేణులు బాబుకు తెగేసి చెప్పేశారంట. అయిన కానీ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా చేరాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీ కాదంటే జనసేనలోనైన చేరాలని తనకు పూర్వం పీఆర్పీలో మంచి పరిచయం ఉన్న నేతల ద్వారా రాయభారాలు నడుపుతున్నరంట. ఎలా అయిన చేరాలని వాసిరెడ్డి పద్మ.. ఎంత మంది ప్రిపర్ చేసిన చేర్చుకోవద్దు అని టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు భీష్మిం