పొంగులేటి పొలిటికల్ బాంబులు ఎందుకు పేలలేదు..?
కోరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు వరుస బెట్టి ఆరెస్ట్ అవుతారు. కాళేశ్వరం, ధరణి లాంటి మరెన్నో బాంబులు పేలతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీపావళి వెళ్లి రెండు రోజులవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులు ఏమి పేలలేదు. అవన్నీ వట్టి మాటలేనా అని ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులు పేలకపోవడానికి ప్రధాన కారణం దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని గవర్నర్ దగ్గర ఉన్నాయి అంట.
గవర్నర్ ఆ ఫైళ్లలన్నీ చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పేలడం ఖాయమంటున్నారు గాంధీ భవన్ వర్గాలు.. దీపావళి కాకపోయిన త్వరలోనే ఆ బాంబులు పేలతాయని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.