కాంగ్రెస్ బలం అదే…?
వందేళ్ళకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి నేటి వరకు రైతులే బలం అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత రైతులే అని అన్నారు.
తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625కోట్ల రైతుబంధును మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాము.
ఆగస్టు పదిహేను తారీఖు నాటికి 22.22 లక్షల మందికి రుణమాఫీ చేశాము. నిన్న కూడా 3.14లక్షల మంది రైతులకు కూడా రూ.2,747కోట్ల రుణాలను మాఫీ చేశాము. బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో పదేండ్ల పాటు మోసం చేసిందని ఆయన ఆరోపించారు.