కవితకు పోటీగా ఆ మహిళా నేత..!

kalvakuntla kavitha
కల్వకుంట్ల కవిత కు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా మీడియాలో కానీ ప్రజల్లో కానీ లేని మహిళ నేతను రంగంలోకి దించారా..?. ఇప్పటికే మండలిలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవాలంటే ఆమెనే కరెక్ట్ అని భావిస్తుందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీ విశ్లేషకులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. బీసీ కుల గణన దగ్గర నుండి ఎస్సీ వర్గీకరణ వరకు ఇటు బయట అటు మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు.మండలిలో ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవడానికి మండలిలో తమ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతిని బరిలోకి దించారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించడానికి ప్రధాన కారణం మండలిలో ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కునేవాళ్లు లేకపోవడం . మండలిలో ఎమ్మెల్సీ కవిత లేవనేత్తుతున్న అంశాలకు సమాధానమివ్వడానికి అధికార పక్షం నీళ్లు నములుతుంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ గుట్టు తేలవడమే కాకుండా ఉద్యమంలో పాల్గోన్న విజయశాంతి అయితే ఇటు బీఆర్ఎస్ ను అటు కవితను అడ్డుకోవచ్చు అనే ప్రణాళికతో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారని గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ అయిన కవితను బీఆర్ఎస్ ను రాములమ్మ ఎంతమేరకు నిలువరించగలుగుతుందో..!
