ఆ “క్రెడిట్ అంతా హారీష్ రావు” దే…? -ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు అంటే ఠక్కున బీఆర్ఎస్ శ్రేణులు గుర్తుకు చేసుకునేది పార్టీకి ట్రబుల్ షూటర్.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడైన.. ఉద్యమంలోనైన .. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన.. అప్పుడైన ఇప్పుడైన ఎప్పుడైన ఓ అంశాన్ని నెత్తినెట్టుకుంటే దాన్ని విజయవంతం చేసే వరకు వదిలిపెట్టని గులాబీ సైనికుడు.. నాయకుడు అని. తాజాగా అదే మరోకసారి నిరూపితమైంది.
నిన్న గురువారం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులందరితో కల్సి దాదాపు ఇరవై కిలోమీటర్ల నుండి సోషల్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా.. యూట్యూబ్ ఛానెళ్లలో లైవ్ పెట్టుకుని మరి గాంధీ నివాసం నుండి కొండాపూర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దాదాపు వందకుపైగా కార్లతో వందల మంది చేరుకుని రాళ్లతో కోడి గుడ్లతో.. టమటాలతో దాడిలకు దిగి భయానంక వాతావరణం సృష్టించారు. సమరసింహా రెడ్డిలో సినిమాలో మదిరిగా హీరో బాలకృష్ణను ఓ వంద కార్లతో వెంబడించిన మాదిరిగా పాడి కౌశిక్ రెడ్డి కి చేరుకుని దాడి నిర్వహించారు. దీంతో అప్పటి వరకు కేవలం పార్టీ నేతలపై.. కార్యకర్తలపైనే కాంగ్రెస్సోళ్ళు దాడులు చేసిన కేసులు పెట్టిన సంఘటనలను బీఆర్ఎస్ శ్రేణూలతో పాటు తెలంగాణ సమాజం గత ఎనిమిది నెలలుగా చూసింది.
కానీ నిన్న ఎమ్మెల్యే గాంధీ సృష్టించిన ఈ భయానంక వాతావరణంతో ఇటు తెలంగాణ సమాజం.. అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏదో తెలియని నిర్వేధం.. భయం.. ఏంటి తెలంగాణ ఏర్పడిన పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటనలను మచ్చుకైన చూడలేదు.. వినలేదు.. కానీ ఎనిమిది నెలల్లోనే అది రాజధాని మహానగరం దేశానికే కాదు ప్రపంచానికి రోల్ మోడలైన హైదరాబాద్ లో అని.. అప్పుడే గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు దాదాపు నూట యాబై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ వెలుగు కిరణం రయ్ రయ్ అంటూ కోండాపూర్ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంది.
చేరుకునే టైంలోపే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ సానుభూతిపరులు,అభిమానులు,ప్రజలను జాగృతి చేసింది ఆ కిరణం.. ఎక్కడక్కడకి ఎమ్మెల్యే నుండి ఎమ్మెల్సీ వరకు. వార్డూ మెంబర్ నుండి సర్పంచ్ వరకు.. ఎంపీ నుండి మాజీ మంత్రుల వరకు ఒకటే సందేశం. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ దాడులను ఖండించాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు,తెలంగాణ సమాజానికి అండగా మేమున్నామనే సందేశమివ్వాలి అని.. అంతే క్షణాల్లో కౌశిక్ రెడ్డి ఇంటికి వేల మంది చేరుకున్నారు. అక్కడదాక బాగానే ఉంది.
ఇక అసలు కథ అక్కడే మొదలెట్టిండు ఆ వెలుగు కిరణం ట్రబుల్ షూటర్ తన్నీరు హారీష్ రావు. అక్కడ ప్రెస్మీట్ పెట్టి .. డైరెక్టుగా సీపీ(సైబరాబాద్ )కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకున్న దగ్గర నుండి ఒకటే నినాదం ” రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే..ఇక సామాన్యులకే రక్షణ ఎక్కడ..?. అది రాజధాని మహానగరం హైదరాబాద్ లో.. ఇక్కడే ఇలా ఉంటే ఇక తెలంగాణ గల్లీలో ఎలా ఉంటుందో..? .. మీరు వందల మందితో వస్తే మేము నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలతో వస్తాం. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం.. న్యాయాన్ని బ్రతికిస్తాం. తెలంగాణను కాపాడుకుంటాం. .. ఈక్రమంలో ఎమ్మెల్యేపై దాడికి హత్యప్రయత్నానికి దిగిన వారిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలి..
ఎమ్మెల్యే పై దాడిని అడ్డుకోలేకపోయిన ఎస్సై సీఐ ఏసీపీ వరకు అందర్ని సస్పెండ్ చేయాలి అని దాదాపు ఆరుగంటల సమయం సీపీ కార్యాలయం వెలుపలే ధర్నాకు దిగారు హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులు. ఇక సాయంత్రం ఆరుగంటల నుండి జరిగిన పరిణామాలు యావత్ తెలంగాణనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఏకం చేసింది. ఒకపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం.. మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి మూడు బృందాలుగా వయా రింగ్ రోడ్ మీదుగా మహబూబ్ నగర మొత్తం అఖరికి నల్లమల అడవుల్లో తిప్పి తిప్పి చివరికి కల్వకుర్తి అసెంబ్లీలొని కేశం పేట పీఎస్ కు తరిలించారు.
ఈ మధ్యలో జరిగిన సంఘటనలు మళ్లీ మలిదశ ఉద్యమంలో ఖమ్మం లో కేసీఆర్ నిరాహర దీక్ష తర్వాత జరిగిన పోరాట పటిమలను గుర్తు తెచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు,తెలంగాణ వాదులు అంటున్నారు. గల్లీ నుండి హైదరాబాద్ గల్లీ వరకు ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను. తెలంగాణ అభిమానులను,వాదులను కదిలించిండు హారీష్ రావు . దీంతో ఏకంగా ఇటు హైదరాబాద్ లో అటు కేశం పేట పీస్ దగ్గరకు కొన్ని వేల మంది జమై బీఆర్ఎస్ కు మద్ధతుగా నిలిచారు.
ఆర్ఆర్ దిగిన దగ్గర నుండి కేశం పేట పీఎస్ కు చేరుకునేవరకు బీఆర్ఎస్ నేతలకు మద్ధతుగా పార్టీ శ్రేణులు,ప్రజలు,అభిమానులు, తెలంగాణ వాదులు మహిళల నుండి రైతుల వరకు., పిల్లల నుండి యువత వరకు రోడ్లపైకి వచ్చి ఆ పోలీస్ వ్యాన్లకు అడ్దంగా ఉండి తమ నేతలను వదిలిపెట్టాలని డిమాండ్ చేయడం.. ధర్నా చేయడం మళ్లీ ఉద్యమ గుర్తులను కండ్ల ముందు కదలాడాయి. ఇదే ఉత్తేజంతో క్యాడర్ పని చేస్తే కాంగ్రెస్ ను మున్ముందు నామారూపాలు లేకుండా చేయడమే కాదు తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుంది. ఈ క్రేడిట్ అంతా గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలోని హారీష్ రావుకే దక్కుతుందని పార్టీ శ్రేణులు తెగ సంబురపడుతున్నారు.