దసరా పూట టీజీఎస్ ఆర్టీసీ ఛార్జీల మోత

Hike Price Of Tickets Of TGSRTC
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా పండుగ పూట కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దసరాకు నడుపుతున్న స్పెషల్ బస్సులో టికెట్ ఛార్జీలు పెంచింది. దీంతో పండుగకు ఇండ్లకు వెళ్ళే ప్రయాణికులు సంతోషంగా ఇంటికెళ్ళి పండుగ చేసుకోవాలనుకుంటే ఈ ఛార్జీల మోత ఎంటని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ ఛార్జీల కంటే ఇరవై ఐదు శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదివరకు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నుండి తొర్రూరుకు లగ్జరీ బస్సుల్లో టికెట్ రూ. 310లు ఉంది.
తాజాగా అదే రూట్ కు మూడు వందల అరవై రూపాయలు తీసుకుంటున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీల మోతపై టీజీఎస్ ఆర్టీసీ ఇంతవరకూ ఆధికారక ప్రకటన చేయకపోవడం విశేషం.. దీనిపై ఇటు ప్రభుత్వం. అటు ఆర్టీసీ క్లారిటీవ్వాల్సి ఉంది.
