సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కచేయని బాబు

Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సంగతి తెల్సిందే. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా వరదసాయం మొత్తం ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
రాష్ట్రానికి సంబంధించిన రైల్వే లైన్.. జోన్.. ఎయిర్ పోర్టులు తదితర అంశాల గురించి సంబధిత మంత్రులతో భేటీ అయ్యారు బాబు. ఈ నేపథ్యంలోనే బాబు తిరుమల శ్రీవారి చిత్రపటంతో పాటు లడ్డూను అందజేశారు. ఈ క్రమంలో ఈ లడ్డూ చాలా పవిత్రమైంది. కల్తీ లేనిది అని అంటూ చెబుతూ అందజేసినట్లు బాబు అనుకూల మీడియా తెగ వార్తలను ప్రసారం చేసింది. రోజూ పేపర్లో మెయిన్ హెడ్డింగ్స్ పెట్టి మరి బాకా ఊదింది.
ఎక్కడ కూడా బాబు బహిరంగంగా ఈ మాటలు అనకపోయిన కానీ ఆయన అనుకూల మీడియా తెగ హాడావుడి చేసింది. దీంతో ఒకపక్క లడ్డూ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయద్దు .. విచారణ చేసేవరకు అందరూ ఈ అంశం గురించి చర్చించవద్దు అని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను బాబు లెక్కచేయలేదని ఆ వార్తలను బట్టి.. ఆయన అనుకూల మీడియా హాడావుడిని బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
