టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్
ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న దేవర మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ మవీ విడుదల రోజు మొత్తం 29 థియేటర్లకు ఆర్ధరాత్రి 1.00గం.లకు, మిగతా థియేటర్లకు ఆర్ధరాత్రి నాలుగు షోలకు అనుమతిచ్చింది.
విడుదలై రోజు టికెట్ ధరకంటే రూ. 100లు ఆదనంగా పెంచుకోవడానికి పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 28నుండి అక్టోబర్ ఆరు వరకు మల్టీఫ్లెక్సుల్లో రూ. 50 లు.. సింగల్ స్క్రీన్ల ధియేటర్లలో రూ. 25లు అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రత్యేక జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా… సైఫ్ ఆలీఖాన్, అజయ్,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.