సాగు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana government is good news for cultivation farmers
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది..
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తాము.. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు…