తెలంగాణ రైతులనూ వదలనీ సైబర్ నేరగాళ్లు
తెలంగాణ వ్యాప్తంగా లక్ష లోపు ఉన్న రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల యాబై వేల మందికి చెందిన రైతు రుణాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.
ఇదే మంచి తరుణం అని భావించి సైబర్ నేరగాళ్లు తమ చేతికి పని చెప్పారు. రైతులకు APK లింకులను పంపి ఆ సొమ్మును కాజేయాలని వ్యూహాలు పన్నారు. అనుకున్నదే తడవుగా లింకుల మెసేజ్ లను రైతుల మొబైల్ నంబర్లకు పంపుతున్నారు.
ఈ క్రమంలో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ సెక్రూటీ బ్యూరో రైతులకు సూచనలు సలహాలు చేస్తుంది. ఎవరూ అలాంటి మెసేజ్ లను ఓపెన్ చేయద్దు. ఒకవేళ ఎవరైన తమ సొమ్మును పోగొట్టుకుంటే 1930 ట్రోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి పిర్యాదు చేయాలని తెలిపింది.