కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!

teenmar mallanna
తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం.
అలాంటి తీన్మార్ మల్లన్న ఏకంగా బీఆర్ఎస్ఎల్పీలో ప్రత్యేక్షమైతే.. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి హారీష్ రావులతో భేటీ అయితే .. ఇంకా ఏముంది. కొంపలు అంటుకునేంత పని చేశారు గులాబీ సైన్యం. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా.. ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న చరిత్ర అట్లుంది మరి. అలాంటి తీన్మార్ మల్లన్నను ఎందుకు కలిశారు. ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకు బీఆర్ఎస్ ఎల్పీలోకి రానీచ్చారు.
ఇలాంటివాడ్ని పార్టీలో చేర్చుకోవద్దు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధాన్ని నడిపారు కొంతమంది బీఆర్ఎస్ నెటిజన్లు.. మరికొంత మంది తీన్మార్ మల్లన్న కల్సింది మన ఆఫీసులోనే.. ఓ ఎమ్మెల్సీగా.. బీసీ నేతగా మాత్రమే కలిశారు తప్పా ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. అనవసరంగా అతని గురించి మన టైం వేస్ట్ చేస్కోవద్దు అని పోస్టులు పెట్టారు.
ఏది ఏమైన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ శ్రేణుల కోపానికి కూడా ఓ ఆర్ధముంది. అయితే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులుండరు.. ఎవరూ శాశ్వత శత్రువులుండరు అనేది అందరూ తెలుసుకోవాలని యూనివర్శల్ ట్రూత్.