జగన్ కనుసైగ చేసుంటే టీడీపీ ఉండేది కాదా..?

YS Jagan Mohan Reddy Former CM OF Andhrapradesh
అధికారంలో ఉన్న ఐదేండ్లలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తలచుకుంటే టీడీపీ ఉండేది కాదా..?. ఐదేండ్లు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయడమే తప్పా ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు వైసీపీకి నాడు తెలియవా..?.
అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకోని వచ్చిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గారు సింగల్ గా.. వైసీపీ పార్టీ సింగల్ గా బరిలోకి దిగుతుంది.
సునామీ అంటే ఏంటో మళ్లీ చూపిస్తుంది అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఘోరీ తానే కట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. బుడమేరు మరణాలు ప్రస్తుత ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆయన ఆరోపించారు. నాడు జగన్ కను సైగ చేసుంటే టీడీపీ ఉండేదే కాదని అన్నారు.
