అధికారులపై మరో టీడీపీ ఎమ్మెల్యే బూతుల పురాణం
ఏపీ అధికార టీడీపీ కి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే ఆయ్యన్నపాత్రుడు ప్రభుత్వ అధికారులపై బూతు పురాణం అందుకున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు.
మీడియాలో రాయలేని చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడుతూ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారులను బెదిరించారు .
కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిడుతూ ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుస్తూ త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను..మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతాను అని హెచ్చరించారు.