మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం

ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు.
అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు.
ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.