రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు-వీడియో
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే..
తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి.
ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి.