మాజీ మంత్రి రోజా కు టీడీపీ కౌంటర్
ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.
రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.దీనిపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
నువ్వు కూడా మాట్లాడుతున్నావా శ్రీలతారెడ్డి అలియాస్ రోజారెడ్డి. మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్ చూడలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు. 5 ఏళ్లపాటు తమరు చేసిన ఘనకార్యాలు, ప్రజలు మర్చిపోలేదు శ్రీలతారెడ్డి. అన్నీ గుర్తున్నాయి’ అని గతంలో ఆమె మాట్లాడిన ఓ వీడియోను Xలో పోస్ట్ చేసింది.