వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం సాధించాయి.
దీంతో ఈ ముగ్గుర్ని తమవైపు లాక్కుంటే ఏజెన్సీ ప్రాంతలో తమకు ఎదురుండదని భావించిన కూటమి ప్రభుత్వం వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను లాక్కునే ప్రయత్నాలు చేసిందంట. ఇదే అంశం గురించి మత్స్య విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం నన్ను సంప్రదించింది. వైసీపీ నుండి తమ ప్రభుత్వానికి మద్ధతుగా ఉండాలని కోరింది. అందుకు ఏమి చేయాల్నో దానికి సిద్ధం అని హామీచ్చింది. నేను మాత్రం వాళ్ల ప్రలోభాలకు లొంగలేదు.
నేను వైసీపీలోనే రాజకీయంగా పుట్టా.. వైసీపీలోనే కడదాక ఉంటాను… పాడేరులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. నేనోక్కడ్నే కాదు పాడేరులో ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేగా భావిస్తారు.. ఇది మాకందరికి పార్టీ ఇచ్చిన గౌరవం.. రాజకీయాలకోసమో.. పదవుల కోసమో కాదు నేను ఉన్నది.. నమ్మి ఓట్లేసిన ప్రజలకు మంచి చేయడం కోసం.. ఇవాళ కాకపోతే రేపు వైసీపీ అధికారంలోకి వస్తుంది.. కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడకండి.. నేనున్నాను అని ఆయన అన్నారు.