టీడీపీ,వైసీపీల మధ్య చిచ్చు పెట్టిన తండేల్ ..!

 టీడీపీ,వైసీపీల మధ్య చిచ్చు పెట్టిన తండేల్ ..!

Loading

అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తీశామని మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సినిమా అప్పట్లో ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ నేవీ అధికారులకు చిక్కి జైల్లో గడిపిన ఇరవై రెండు మంది జాలర్ల గురించి తీసింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం హాయాంలో ప్రస్తుత కేంద్ర మంత్రి .. అప్పటీ ఎంపీ కింజారపు రామ్మోహానాయుడు కేంద్ర ప్రభుత్వానికి పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న తమ ప్రాంత జాలర్లను విడుదల చేయించాలని లేఖ రాశారు.

కానీ విడుదల కాలేదు. అప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ ఆధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కల్సిన బాధిత కుటుంబ సభ్యులకు హామీచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోనే తీసుకోస్తాను అని. అధికారంలోకి వచ్చాక అన్నట్లుగానే తీసుకోచ్చారు. అక్కడితో ఆగకుండా ఒక్కొక్కరికి ఐదు లక్షల చోప్పున ఆర్థిక సాయం కూడా అందించారు జగన్. ఇది అసలు కథ. ఈ కథ ఆధారంగా తీసిన సినిమాలో ఇటు టీడీపీ గురించి కానీ అటు వైసీపీ గురించి కానీ ఎక్కడకూడా ప్రస్తావన లేదు.

కానీ సినిమా విడుదలైన తర్వాత అసలు ఈ కథకు మూలకారణం మా పార్టీ అంటే.. మా పార్టీ అంటూ తండేల్ మూవీ గురించి ఇరు పార్టీల అభిమానులు. నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు.. అక్కడితో ఆగకుండా యూట్యూబ్.. ట్విట్టర్ . ఇన్ స్టాగ్రామ్ ఏది వదలకుండా వాట్సాప్ లో సైతం మూవీ గురించి తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు.. దీంతో ఇటు పొలిటీకల్ తో పాటు సినీ ప్రేక్షకులకు.మధ్యలో సామాన్యులకు అసలు ఈ సినిమాలో ఏముందనే ఉత్సుకతను తీసుకోచ్చారు ఇరు పార్టీల నెటిజన్లు.

దీంతో సినిమాపై ఆసక్తి నెలకొనడంతో సినిమా హాళ్లకు క్యూలు కడుతున్నారు అంత. దీంతో సినిమా కలెక్షన్లు సైతం పెరుగుతున్నాయి. సినిమాకు మంచి ప్రమోషన్స్ లభిస్తుందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అంటే టీడీపీ వైసీపీ వార్ తో తండేల్ మూవీకి మంచి ప్రమోషన్ వస్తుందన్నమాట. ఇది అన్నమాట అసలు ముచ్చట.!౩

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *